Virat Kohli: కోహ్లి.. నీ నిర్ణయం నిస్వార్థమైనది: మైకేల్‌ వాన్

తాజా వార్తలు

Published : 18/09/2021 01:05 IST

Virat Kohli: కోహ్లి.. నీ నిర్ణయం నిస్వార్థమైనది: మైకేల్‌ వాన్

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కోహ్లి నిర్ణయం నిస్వార్థమైనదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ప్రశంసించాడు. దీంతో రిలాక్స్ అవడానికి కోహ్లికి సమయం దొరికినట్లయిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌పై వాన్‌ స్పందించాడు. ‘వెల్‌డన్‌ కోహ్లి.. నీ నిర్ణయం నిస్వార్థమైనది. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందడానికి కొంచెం సమయం దొరికింది’ అని వాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. 

2017లో అప్పటి కెప్టెన్‌ ధోని నుంచి పగ్గాలందుకున్న కోహ్లి.. మూడు ఫార్మాట్లకు సారథ్యం వహిస్తూ వచ్చాడు. అయితే, పనిభారం తగ్గించుకోవడానికి టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కోహ్లి రికార్డు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. భారత్‌ని ఐసీసీ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో విఫలమవుతున్నాడు. కోహ్లి తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టేదెవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికైతే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా పేరున్న రోహిత్‌ శర్మకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని