Covid-19: ఇంగ్లాండ్‌ జట్టులో ఏడుగురికి కరోనా 

తాజా వార్తలు

Updated : 06/07/2021 17:20 IST

Covid-19: ఇంగ్లాండ్‌ జట్టులో ఏడుగురికి కరోనా 

ముగ్గురు ఆటగాళ్లు.. నలుగురు సిబ్బందికి వైరస్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టులో పెద్ద కలవరం మొదలైంది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం ఏడుగురు సభ్యులకు వైరస్‌ సోకింది. అందులో ముగ్గురు ఆటగాళ్లుండగా మరో నలుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. అయితే, వారి పేర్లను మాత్రం ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు బయటపెట్టలేదు. ప్రస్తుతం ఇంగ్లిష్‌ జట్టంతా ఐసోలేషన్‌లో ఉందని ఆ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఆటగాళ్లకు, సిబ్బందికి సోమవారం పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

మరోవైపు ఇంగ్లాండ్‌ బుధవారం నుంచి పాకిస్థాన్‌తో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, కార్డిఫ్‌లో జరగాల్సిన తొలి వన్డే షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని ఈసీబీ మంగళవారం స్పష్టం చేసింది. దాంతో బెన్‌స్టోక్స్‌ కెప్టెన్సీ ఆధ్వర్యంలో కొత్త జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టామ్‌ హారిసన్‌ మీడియాతో మాట్లాడుతూ బయో సెక్యూర్‌ పరిస్థితులకు దూరంగా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తాము ముందే ఊహించామన్నారు. గడిచిన 14 నెలల్లో ఆటగాళ్లు, సిబ్బంది ఎక్కువశాతం కఠిన పరిస్థితుల్లో గడిపినందున అందరి మంచి కోసం కరోనా నిబంధనల్ని పాటించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని