అందుకే కోహ్లీ గొప్ప నాయకుడయ్యాడు: మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

తాజా వార్తలు

Published : 08/09/2021 01:15 IST

అందుకే కోహ్లీ గొప్ప నాయకుడయ్యాడు: మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఇంటర్నెట్‌ డెస్కు : కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వంపై మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించాడు. ఆట పట్ల అతడి దృక్పథం, బాడీ లాంగ్వేజ్.. కోహ్లీకి ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టాయన్నాడు. ‘నేను ఆడినప్పటి కెప్టెన్‌ సహా చాలా మంది కెప్టెన్లు.. తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. ప్రస్తుతం కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నంత కాలం.. ఎవరేమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోనవసరం లేదు. అందుకే అతడు గొప్ప కెప్టెన్‌గా ఎదిగాడు. నేను కూడా దాన్ని సమర్థిస్తా’ అని లక్ష్మణ్‌ అన్నాడు.

‘ఆట పట్ల అతడి దృక్పథం, బాడీ లాంగ్వేజ్‌ కూడా గొప్పగా ఉంటాయి. సుదీర్ఘ కాలం దాన్ని కొనసాగించడం అసాధ్యం. కానీ, కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా అదే తీవ్రతతో ఆడుతున్నాడు. ఎన్నో బరువు బాధ్యతలను భుజానికెత్తుకుని.. భారతజట్టును నడిపించడమనేది సులభమేమి కాదు. అయినా కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు’ అని లక్ష్మణ్‌ ప్రశంసించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని