పంత్‌.. దూకుడు తగ్గించు: కపిల్‌దేవ్‌

తాజా వార్తలు

Published : 27/05/2021 00:18 IST

పంత్‌.. దూకుడు తగ్గించు: కపిల్‌దేవ్‌


(photo:Rishabh Pant Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దూకుడైన ఆటతీరుతో అతితక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమ్‌ఇండియా ‘పవర్‌ హిట్టర్‌’ రిషభ్ పంత్. అయితే, మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌ పర్యటనలో పంత్..  కాస్త దూకుడును తగ్గించుకుని ఆడాలని సూచిస్తున్నాడు భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌. ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించొద్దని పంత్‌ సూచించాడు.

‘రిషభ్ పంత్ జట్టులోకి వచ్చినప్పటి నాటి కంటే...ఇప్పుడు చాలా పరిణతి చెందిన క్రికెటర్‌లా కనిపిస్తున్నాడు. అతడు షాట్లు ఎక్కువగా ఆడటానికి ప్రయత్నిస్తాడు. మంచి షాట్లు ఆడగల సత్తా అతడి దగ్గర ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ, ఇంగ్లాండ్ పరిస్థితులు సవాళ్లు విసురుతాయి. అక్కడ ప్రతి బంతిని హిట్‌ చేయడానికి ప్రయత్నించకుండా క్రీజులో ఎక్కువ సమయం గడపాలి. ఎన్నో రకాల షాట్లు ఆడగలిగే రోహిత్ శర్మకు కూడా ఇదే చెప్పాం. చాలాసార్లు ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. పంత్‌కు కూడా అదే చెబుతున్నా. పంత్ అద్భుతమైన, ఎంతో విలువైన ఆటగాడు. అతడు షాట్లు ఆడటానికి ముందు ఎక్కువ సమయం క్రీజులో గడపాలి. ఇంగ్లాండ్‌ పరిస్థితులు భిన్నమైనవి’ అని కపిల్‌దేవ్‌ చెప్పాడు. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అనంతరం అతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని