INDvsENG: అలాగైతే కోహ్లీసేనను ఓడించొచ్చు

తాజా వార్తలు

Published : 02/07/2021 10:31 IST

INDvsENG: అలాగైతే కోహ్లీసేనను ఓడించొచ్చు

ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడమే ఫైనల్లోఓటమికి కారణం: కుక్‌

లండన్‌: ఐదు టెస్టుల సిరీసులో బంతి స్వింగ్‌ అయితే టీమ్‌ఇండియా ఇబ్బందులు పడుతుందని ఇంగ్లాండ్‌ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ అంటున్నాడు. భారత్‌కు గొప్ప బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా కదిలే బంతిని ఆడలేకపోవడం వారి బలహీనతని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేశాడు.

‘టీమ్‌ఇండియా గొప్ప జట్టు. కానీ స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం వారి బలహీనత. ఆగస్టు నెలలో వాతావరణం చల్లగా ఉండి, బౌలర్లకు అనకూలిస్తే ఇంగ్లాండ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని కుక్‌ అన్నాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా జట్టు ఎంపికలో తప్పులు చేసిందని కుక్‌ తెలిపాడు. తమను తాము కాస్త అతిగా అంచనా వేసుకున్నట్టు కనిపించిందన్నాడు.

‘జట్టు ఎంపికపై  కోహ్లీసేన ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. మూడు రోజులు ముందుగానే జట్టును ప్రకటించింది. ఆటలో ఎక్కువ భాగం వర్షం కురుస్తుందని ముందే తెలిసినా ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నారు. దాంతో ఎక్కువగా సీమ్‌ బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది’ అని కుక్‌ తెలిపాడు.

ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడమూ ఒక కారణమేనని కుక్‌ అన్నాడు. ‘న్యూజిలాండ్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉంది కాబట్టే గెలిచిందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టులతో వారికి సన్నద్ధత లభించింది. అంతర్గత మ్యాచులు ఆడాలన్న ఉద్దేశం మంచిదే అయినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. తొలి గంటలో ఉన్నంత తీవ్రత తర్వాత మాయమవుతుంది’ అని అతడు వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని