ఐసీసీకి ఫిర్యాదుపై ఇప్పుడు స్పందించను..
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 11:03 IST

ఐసీసీకి ఫిర్యాదుపై ఇప్పుడు స్పందించను..

మొతేరా పిచ్‌పై ఇంగ్లాండ్‌ కోచ్‌ ఏమన్నాడంటే?

(Photo:England and wales Cricket board twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించడంతో పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది టెస్టులకు పనికిరాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పిచ్‌పై ఫిర్యాదు చేసే విషయంలో మేం తెరవెనుక చర్చించుకుంటామని ఇంగ్లాండ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ పేర్కొన్నాడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే, పింక్‌బాల్‌ టెస్టులో తమకన్నా టీమ్‌ఇండియా బాగా ఆడిందని, ఆ విషయాన్ని అంగీకరించాలని సిల్వర్‌వుడ్‌ స్పష్టం చేశాడు. ఆ మ్యాచ్‌ పూర్తయ్యాక ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ మాట్లాడుతూ పిచ్‌ను తప్పుబట్టడం సరికాదని, ఆట త్వరగా పూర్తవ్వడానికి పింక్‌ ఎస్జీ బంతే కారణమని చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇంగ్లాండ్‌ కోచ్‌.. ‘పిచ్‌ ఎలా ఉన్నా మూడో టెస్టులో టీమ్‌ఇండియా మాకన్నా బాగా ఆడింది. నిజం చెప్పాలంటే మా ఆటగాళ్లని మునుపెన్నడూ లేని విధంగా కట్టడి చేసింది. అయితే, పిచ్‌ తీరు ఇంకాస్త బాగుంటుందని మేం ఆశించాం’ అని పేర్కొన్నాడు. పిచ్‌ పనితీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘కచ్చితంగా మేం కొన్ని విషయాలు చర్చించుకుంటాం. అయితే, మూడు రోజుల ముందుగానే ఈ మ్యాచ్‌ పూర్తవ్వడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. నా దృష్టిలో ఇప్పుడు తర్వాతి టెస్టు గురించే ఆలోచించాలి. అక్కడ విజయం సాధించి సిరీస్‌ డ్రా చేసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నాడు.

‘అయితే, ఒక విషయంలో మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌తో మాట్లాడాం. అది పిచ్‌ గురించి కాదు. అయితే, మొతేరా లాంటి పిచ్‌లపై మేమింకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కచ్చితంగా అంగీకరించాలి. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌ను సద్వినియోగం చేసుకొని మేం భారీ స్కోర్‌ చేసే అవకాశం దక్కింది, కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఇక ఐసీసీకి ఫిర్యాదు చేసే విషయంపై ఇప్పుడు స్పందించను. అది నాకూ, రూట్‌కు సంబంధించిన చర్చ. ఇలా చేయడం వల్ల మేం పరిస్థితులకు తలొగ్గుతున్నామని కాదు. ఇప్పుడు వాటి మీద స్పందించలేను. ఏం చేస్తామో, చేయమో చెప్పలేని స్థితిలో ఉన్నా’ అని ఇంగ్లాండ్‌ కోచ్‌ వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని