Ben Stokes: క్రికెట్‌కు విరామం ప్రకటించిన ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌

తాజా వార్తలు

Updated : 30/07/2021 22:54 IST

Ben Stokes: క్రికెట్‌కు విరామం ప్రకటించిన ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌

లండన్‌: భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు గుడ్‌ బై చెబుతున్నట్టు వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నాలుగో తేదీ నుంచి భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానున్న వేళ బెన్‌ స్టోక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌ జట్టు సాధించిన అనేక విజయాల్లో ఈ ఈ ఎడమ చేతివాటం ఆటగాడు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని