అతడిని తలచుకుంటే భయమేస్తుంది: మోర్గాన్‌
close

తాజా వార్తలు

Updated : 12/03/2021 09:22 IST

అతడిని తలచుకుంటే భయమేస్తుంది: మోర్గాన్‌

(Photo: Malan Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో తమ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ సాధించేది తలచుకుంటే భయమేస్తుందని ఇంగ్లాండ్‌ జట్టు పరిమిత ఓవర్ల సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. గతేడాది టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మలన్‌ ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో నంబర్‌ వన్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా, నేటి నుంచి ఇంగ్లాండ్‌.. టీమ్‌ఇండియాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలోనే మోర్గాన్‌ తొలి మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మలన్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘మలన్‌ ఎంత దూరం వెళ్తాడో నాకు తెలియదు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడిలాగే కొనసాగితే ఏం చేస్తాడోనని భయమేస్తుంది. ఈసారి ఐపీఎల్‌లో పంజాబ్‌ అతడిని కొనుగోలు చేసింది. దాంతో భారత్‌లో ఆడుతూ ఇక్కడ తన అనుభవాన్ని కొనసాగిస్తాడు. రాబోయే రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ఉండడంతో అది మాకు కలిసివస్తుంది’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌పై స్పందిస్తూ.. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్‌ ఆడటం వల్ల తాము ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుందని చెప్పాడు. ప్రపంచంలోనే మేటి జట్టు అయిన టీమ్‌ఇండియాతో తలపడుతున్నామని, దాన్ని ఓడించడం అంతతేలిక కాదనే విషయం తమకు తెలుసన్నాడు. దీంతో రాబోయే సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోర్గాన్ చెప్పాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని