Sir: అబ్బే.. నేనలా అనలేదు తెలుసా!
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:58 IST

Sir: అబ్బే.. నేనలా అనలేదు తెలుసా!

భారతీయ క్రికెటర్ల ఎగతాళి ట్వీట్లపై ఇయాన్‌ మోర్గాన్‌ స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ట్విటర్లో పోస్ట్‌ చేసిన ‘సర్’ పదం గౌరవంతో చేసిందేనని ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అంటున్నాడు. ఎగతాళి చేసేందుకో, బాధ పెట్టేందుకో సోషల్‌ మీడియాలో అలా చేయలేదని పేర్కొన్నాడు. సదుద్దేశంతోనే ‘సర్’ పదాలను ఉపయోగించానని వెల్లడించాడు.

యువ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌ న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. యువకుడిగా ఉన్నప్పుడు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఆ మ్యాచ్‌ సమయంలో సోషల్‌ మీడియాలో ప్రచారం అయ్యాయి. దాంతో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అతడిని అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా సస్పెండ్‌ చేసింది. దర్యాప్తు జరిపిస్తోంది. అదే సమయంలో భారతీయులను ఎగతాళి చేస్తూ.. వారి భాషను హేళన చేస్తూ ఇయాన్‌ మోర్గాన్‌, జోస్‌ బట్లర్‌ చేసిన ట్వీట్లు తెరమీదకు వచ్చాయి. ‘సర్’ అనే పదాలను ఉపయోగిస్తూ వారు ట్వీట్లు చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. వాటిపై మోర్గాన్‌ ఇప్పుడు స్పందించాడు.

‘వాటిని నేను పట్టించుకోవడం లేదు. నేను సోషల్‌ మీడియా లేదా ప్రపంచంలో ఇంకెక్కడైనా సర్‌ అన్నానంటే గౌరవం, స్ఫూర్తితోనే! వాటిని మరోలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. అందుకే నేను వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని మోర్గాన్‌ అన్నాడు. విధ్వంసక ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ను త్వరలోనే జట్టులోకి తీసుకుంటామని అతడు చెప్పాడు. అతడో అద్భుతమైన క్రికెటరని, భారీ స్కోర్లు చేస్తాడని పేర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ ముందు జరిగిన డ్రగ్స్‌ పరీక్షలో పాజిటివ్‌ రావడంతో అతడు జట్టులో చోటు కోల్పోయాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని