అభిమాని సర్‌ప్రైజ్‌: బాగోదన్న రోహిత్‌

తాజా వార్తలు

Updated : 02/01/2021 14:07 IST

అభిమాని సర్‌ప్రైజ్‌: బాగోదన్న రోహిత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కఠోర సాధన చేస్తూనే కాస్త సమయం దొరికినప్పుడు కంగారూల గడ్డను చుట్టేస్తున్నారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. భోజనాలు చేసిన తర్వాత వాళ్లు బిల్లు అడిగితే.. అప్పటికే దాన్ని చెల్లించారని హోటల్ సిబ్బంది తెలిపారు. మీ టేబుల్‌ వెనుక కూర్చున్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తి బిల్లును కట్టేశారని పేర్కొన్నారు. దీంతో మన క్రికెటర్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో, బిల్లు ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

భారత్‌కు చెందిన నవల్‌దీప్‌ సింగ్‌ మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. జనవరి 1న అతడు ఓ హోటల్‌కు వెళ్లగా రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, నవదీప్‌ సైని, శుభ్‌మన్‌ గిల్‌ తన ముందు టేబుల్‌లో కూర్చున్నారు. అనుకోకుండా తనకి వచ్చిన ఈ అవకాశాన్ని జ్ఞాపకంగా మిగిల్చుకోవాలని మన క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. దీనికి సంబంధించిన వీడియో, బిల్లును తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘‘నేను బిల్లును చెల్లించినట్లు వాళ్లకి తెలియదు. నా సూపర్‌స్టార్స్‌ కోసం ఆ మాత్రం చేయలేనా!’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు. దాన్ని రీట్వీట్ చేస్తూ..‘‘బిల్లు కట్టానని తెలుసుకున్న రోహిత్ నా వద్దకు వచ్చి.. ‘బ్రదర్‌.. డబ్బులు తీసుకో. మీరు చెల్లించడం బాగోద’ని అన్నాడు. అందరం కలిసి ఓ ఫొటో తీసుకున్నాం’’ అని పోస్ట్‌ చేశాడు.

ఇదీ చదవండి

బుమ్రాకు.. 5 సెకన్లు చాలు! 

టెస్టుల్లోకి వచ్చేశాడు
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని