WTC Final: థాంక్యూ ఐసీసీ 
close

తాజా వార్తలు

Published : 18/06/2021 16:37 IST

WTC Final: థాంక్యూ ఐసీసీ 

వర్షం కారణంగా అభిమానుల ఆగ్రహం!

(BCCI Photo)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహించడంపై క్రికెట్‌ అభిమానులు ఐసీసీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. తటస్థ వేదికగా ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ ఏజిస్‌బౌల్‌ మైదానంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ప్రతిష్ఠాత్మక తుదిపోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే, ఉదయం నుంచి మ్యాచ్‌ జరిగే ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో అంపైర్లు తొలి సెషన్‌ను రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఐసీసీ ట్విటర్‌లో పంచుకోగా, అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు జూన్‌లో సరిగా ఉండవని తెలిసినా అక్కడ కీలక మ్యాచ్‌లు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంగ్లాండ్‌లో జరిగిన పలు ప్రతిష్ఠాత్మక మ్యాచుల సందర్భంగా వర్షాలు కురిసి అంతరాయం కలిగించిన సంఘటనలను కూడా గుర్తుచేశారు. 2013, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలతో పాటు 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా వర్షం కురిసిందని చెప్పారు. కీలక మ్యాచ్‌లకు ఇంగ్లాండ్‌ పరిస్థితులు సరికాదని తెలిసినా పదే పదే ఐసీసీ ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు నెటిజెన్లు సరదా మీమ్స్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. మీరూ వాటిని చూసి ఆస్వాదించండి.











Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని