close

తాజా వార్తలు

Published : 28/02/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీ.. అనుష్క ఉండగా కుంగుబాటేలా? 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ 2014లో కుంగుబాటుకు గురయ్యానని ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై మాజీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఫరూక్‌ ఇంజనీర్‌ స్పందించారు. అనుష్కలాంటి అందమైన భార్య ఉండగా, ఎలా నిరాశకు లోనయ్యావని ప్రశ్నించాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ మాజీ క్రికెటర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘అంత అందమైన భార్య ఉండగా కుంగుబాటుకు ఎలా గురయ్యావు? ఇప్పుడు కోహ్లీకి పాప కూడా జన్మించింది. ఆ భగవంతుడికి రుణపడి ఉండాలి. అయితే, కుంగుబాటు అనేది పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది. వాళ్లే దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు. మన మెదడు ఎలా పనిచేస్తుందో ఎప్పటికి తెలియదు. మన భారతీయులకు కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే మానసిక స్థైర్యం మనకు ఉంటుంది’ అని ఫరూక్‌ చెప్పుకొచ్చాడు. అయితే, ఇక్కడే మాజీ క్రికెటర్‌ తప్పులో కాలేశాడు. విరాట్‌.. అనుష్కను వివాహమాడింది 2017 డిసెంబర్‌ 11న. అంటే 2014లో కోహ్లీ ఒంటరిగానే ఉన్నాడు.

ఇక 2014లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో పది ఇన్నింగ్సుల్లో 13.50 అత్యల్ప సగటు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఆ పర్యటన తర్వాత డిప్రెషన్‌కు లోనైనట్లు విరాట్‌ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ప్రపంచంలో తాన్కొడే ఉన్నట్లు భావించానని వివరించాడు. అప్పుడు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సలహాలు తీసుకున్నట్లు చెప్పాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని