IPL: అయినా కొనసాగుతుంది: బీసీసీఐ

తాజా వార్తలు

Updated : 29/04/2021 12:41 IST

IPL: అయినా కొనసాగుతుంది: బీసీసీఐ

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లీగ్‌ నుంచి ఇండియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం లీగ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. లీగ్‌ నుంచి నిష్క్రమణలు ఉన్నా, ఐపీఎల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

తన కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతుండటంతో వారికి అండగా ఉండేందుకు సిరీస్‌ నుంచి తప్పుకొంటున్నట్లు దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్‌ తెలిపాడు. ఆండ్రూ టై(రాజస్థాన్‌), కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా(రాయల్‌ ఛాలెంజర్స్‌)లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ‘ప్రస్తుతం ఐపీఎల్‌ లీగ్‌ కొనసాగుతుంది. ఎవరైనా లీగ్‌ నుంచి తప్పుకోవాలనుకుంటే మంచిదే’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ తెలిపాయి. భారత్‌ నుంచి వచ్చే సమాచారాన్ని ఆస్ట్రేలియన్‌ ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం 14 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఉన్నారు. లీగ్‌ అయిపోయిన వెంటనే ప్రత్యేక విమానంలో వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మే 30వ తేదీ వరకూ ఐపీఎల్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని