close

తాజా వార్తలు

Published : 28/02/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తనపై చేసిన మీమ్‌కు రవిశాస్త్రి రిప్లై

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిపై నెటింట్లో మీమ్స్‌ రావడం కొత్తేమి కాదు. గెలిస్తే సంబరాలు చేసుకోవాలని ఆయన ఫొటోలతో ఫన్నీగా పోస్ట్‌లు చేస్తుంటారు. అయితే ఇంగ్లాండ్‌పై భారత్‌ రెండు రోజుల్లోనే ఘన విజయం సాధించిన సందర్భంగా ఓ మీమ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘నేను అయిదు రోజులు డ్రైగా ఉండాలంటే కష్టమని అనుకుంటున్నారా’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడంటూ ఆ పోస్ట్‌లో ఉంది.

కాగా, ఆ పోస్ట్‌ను రచయిత శోభ ట్వీట్ చేస్తూ రవిశాస్త్రిని ట్యాగ్‌ చేసింది. అయితే దీనికి రవిశాస్త్రి బదులిచ్చాడు. ‘ఈ సరదాని ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రస్తుత కఠిన సమయాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని రీట్వీట్ చేశాడు. మొతేరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌటైంది.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని