Neeraj Chopra: ఇదే ప్రదర్శన చేస్తే పతకం తేగలను!

తాజా వార్తలు

Published : 05/08/2021 01:45 IST

Neeraj Chopra: ఇదే ప్రదర్శన చేస్తే పతకం తేగలను!

టోక్యో: అర్హత పోటీల్లోని ప్రదర్శననే ఫైనల్లోనూ పునరావృతం చేయాల్సి ఉందని భారత జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా అన్నాడు. జావెలిన్‌ను మొదటి అవకాశంలోనే అద్భుతంగా విసిరినందుకు ఆనందంగా ఉందన్నాడు. కొవిడ్‌ కారణంగా విశ్రాంతి లేకుండా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తుదిపోరుకు మానసికంగా సన్నద్ధం అవ్వాల్సి ఉందని వెల్లడించాడు.

బుధవారం జరిగిన జావెలిన్‌ త్రో అర్హత పోటీల్లో నీరజ్‌ చోప్రా దుమ్మురేపాడు. జావెలిన్‌ను 86.65 మీటర్లు విసిరి గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచాడు. అర్హత మార్కైన 83.50 మీటర్లను తొలి అవకాశంలోనే దాటేశాడు. ఇందుకు అతడికి కొన్ని సెకన్ల సమయమే పట్టింది.

‘నాకిదే తొలి ఒలింపిక్స్‌. నాకెంతో ఆనందంగా ఉంది. వార్మప్‌లో నా ప్రదర్శన అంత బాగాలేదు. అర్హత పోటీల్లో మాత్రం జావెలిన్‌ను మంచి కోణంలో అత్యుత్తమంగా విసిరాను’ అని నీరజ్‌ అంటున్నాడు. ఏదేమైనా ఫైనల్లో పరిస్థితులు కఠినంగా ఉంటాయని, పోటీ భిన్నంగా ఉంటుందని తెలుసన్నాడు.

‘నాకిదే తొలి ఒలింపిక్స్‌ కావడంతో ఫైనల్‌ అనుభవం భిన్నంగా ఉండనుంది. శారీరకంగా మేమెంతో కఠినంగా శిక్షణ పొందాం. పోటీకి సిద్ధంగా ఉన్నాం. మానసికంగా సిద్ధమవ్వడమూ ముఖ్యమే. విసరడంపై నేను మరింత శ్రద్ధపెట్టి ఇదే ప్రదర్శన పునరావృతం చేయాలి. ఎక్కువ మీటర్లు విసరాలి’ అని నీరజ్‌ అంటున్నాడు. శనివారం సాయంత్రం అతడు ఫైనల్‌ ఆడనున్నాడు. అర్హత పోటీల్లో నీరజ్‌ 2017 ప్రపంచ ఛాంపియన్‌, స్వర్ణ పతక ఫేవరెట్‌ జొహన్నెస్‌ వెట్టెర్‌ (జర్మనీ)ను వెనక్కి నెట్టేయడం గమనార్హం.

కొవిడ్‌-19 వల్ల ఒలింపిక్స్‌కు సిద్ధమవ్వడం కష్టంగా మారిందని నీరజ్‌ అన్నాడు. గతేడాది మెగా క్రీడలకు సిద్ధమైనప్పుడు కరోనా వల్ల అన్నీ మూతపడ్డాయని తెలిపాడు. మొదట్లో బాధేసిందని మళ్లీ క్రీడలు జరుగుతాయని ప్రకటించడంతో నిరంతరం సాధన చేశామన్నాడు. చోప్రా తన కెరీర్లో అత్యుత్తమంగా 88.07 మీటర్లు (2021, మార్చ్‌లో) విసిరాడు. అతడి ప్రధాన పోటీదారు వెట్టెర్‌  ఏప్రిల్‌, జూన్‌ మధ్య 90 మీటర్లు విసరడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని