
తాజా వార్తలు
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ఆటగాడిగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ ఇప్పుడు తెరపై నటుడిగా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. తొలిసారిగా హర్భజన్ నటించిన చిత్రం ‘ఫ్రెండ్షిప్’. ప్రముఖ నటుడు అర్జున్‌తో కలిసి భజ్జీ తెరను పంచుకోనున్నాడు. జాన్‌పాల్ రాజ్, శ్యామ్సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీలంకకు చెందిన లొస్లియా ఈసినిమాలో కీలకపాత్ర పోషించింది. డి.ఎం.ఉదయకుమార్ సంగీతం అందించారు. జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. కళాశాల, క్రీడలు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
భజ్జీ గ్యాంగ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఆ స్టూడెంట్స్ దగ్గర భయం అనేది లేనేలేదు’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌లు.. మధ్యలో ‘గెట్ రెడీ’ అంటూ అర్జున్ హెచ్చరికలు.. చివర్లో ‘నీకు క్రికెట్ ఆడటం తెలుసా.. లేకపోతే నన్ను అడుగు’ అని భజ్జీకి ఓ వ్యక్తి సలహాలు.. ఇలా టీజర్ ఆసక్తిగా సాగుతోంది. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.