close

తాజా వార్తలు

Updated : 20/01/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గబ్బా హీరోస్‌.. సూపర్‌ మీమ్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గబ్బా మైదానం వేదికగా జరిగిన ఆఖరి టెస్టు‌ మ్యాచ్‌ విజయంలో రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషించారు. ఆఖరి టెస్టు‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన యువ ఆటగాళ్లపై నెటిజన్లు తమదైన రీతిలో సరదా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..?

ఓటమిని జీర్ణించుకోని ఆసీస్‌ మండిపోతోందంటూ.. ప్యాంటు కాలిపోతున్న చిత్రంతో వసిమ్‌ జాఫర్‌ ట్రోల్‌ చేశాడు.

ఇటీవల వచ్చిన ‘మాస్టర్‌’ సినిమాలో హీరో ఎలివేషన్‌ సన్నివేశాన్ని పోలుస్తూ.. ఆసీస్‌కు పంత్‌ చుక్కలు చూపించాడని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు.

వేగంగా దూసుకెళ్తున్న రైలుకి ఏదైనా అడ్డొస్తే అంతే.. అంటూ మరో నెటిజన్‌ ఆస్ట్రేలియన్‌ బౌలింగ్‌ను ఎద్దేవా చేశాడు.

భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్‌ను స్పైడర్‌ మ్యాన్‌తో పోలుస్తూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దూసుకొస్తున్న బంతుల్ని దీటుగా ఎదుర్కొనే నయావాల్‌ పుజారా.. పిచ్‌లో ఓ కొండలా పాతుకుపోయాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

















Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని