MS Dhoni: నాకు సిగ్గెక్కువని మహీభాయ్‌కు తెలుసు!
close

తాజా వార్తలు

Published : 12/06/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MS Dhoni: నాకు సిగ్గెక్కువని మహీభాయ్‌కు తెలుసు!

టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం సంతోషం: రుతురాజ్‌

పుణె: భారత క్రికెట్‌ జట్టుకు పిలుపొచ్చినందుకు సంతోషంగా ఉందని యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. పరిస్థితులు, వాతావరణానికి త్వరగా అలవాటు పడటం తన బలంగా పేర్కొన్నాడు. శ్రీలంక పర్యటనలో రాణించి అందరినీ ఆకట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. టీమ్‌ఇండియాకు ఎంపికైన సందర్భంగా అతడు మాట్లాడాడు.

‘విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉంది. క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టినప్పట్నుంచి మొత్తం ప్రయాణం కళ్లముందు గిర్రున తిరిగింది. భావోద్వేగానికి గురయ్యాను. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్‌లు నాకు గుర్తొచ్చారు. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంతో వారంతా ఆనందించారు’ అని గైక్వాడ్‌ తెలిపాడు. 59 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 47+ సగటు, 130 టీ20ల్లో 130 స్ట్రైక్‌రేట్‌తో అతడు పరుగులు చేయడం గమనార్హం.

ఎలాంటి పరిస్థితులకైనా త్వరగా అలవాటు పడటం తన బలమని రుతురాజ్‌ అన్నాడు. అవసరమైతే దూకుడుగా, నిలకడగా ఆడటం తన బలమని తెలిపాడు. తిరిగి రాహుల్‌ ద్రవిడ్‌తో కలవడం ఆనందంగా ఉందన్నాడు. ‘అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఈ ప్రయాణం నుంచి వీలైనంత నేర్చుకుంటాను. మళ్లీ రాహుల్‌ సర్‌తో కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌-ఏ జట్టు విదేశాల్లో పర్యటించింది ఏడాదిన్నర గడిచింది. మళ్లీ ఆయనతో కలిసేందుకు, మాట్లాడేందుకు, నేర్చుకొనేందుకు ఇదో సువర్ణావకాశం’ అని పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడానికి ముందు గైక్వాడ్‌ దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున అదరగొట్టాడు. ఎంఎస్‌ ధోనీ తనకెలా మద్దతుగా నిలిచాడో వివరించాడు. ‘మహీభాయ్‌ ఏం మాట్లాడినా ఆకట్టుకుంటుంది. మ్యాచులు ముగిశాక ఆయన నా గురించి మీడియాతో మాట్లాడటం విన్నాను. ఆయనతో నేను ఎక్కువగా మాట్లాడను. నాకు సిగ్గు ఎక్కువని ఆయనకు తెలుసు. అందుకే ఒత్తిడిగా ఉంటే ఆయనే నా వద్దకు సముదాయిస్తారు. గతేడాది ఐపీఎల్‌ను గొప్పగా ఆరంభించలేదు. ఆటను ఆస్వాదించాలని, ఆందోళన పడొద్దని కుదుటపరిచారు. అవసరమైనప్పుడు క్రికెట్‌, జీవిత సలహాలు ఇస్తుంటారు. దేశవాళీ క్రికెట్లో కేదార్‌ జాదవ్‌ నన్ను ప్రోత్సహించారు’ అని రుతురాజ్‌ అన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని