
తాజా వార్తలు
గంగూలీకి మరోసారి అస్వస్థత?
ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ వర్గాల సమాచారం
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో హుటాహుటిన ఆయనను కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారని తెలిసింది. రాత్రి నుంచి అసౌకర్యంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనవరి 2న గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. ఉదయం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుండగా వాంతులు, తలనొప్పి, ఛాతినొప్పి వచ్చిందని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టంట్ వేశారు. రెండు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగతా పూడికలను తొలగించేందుకు మరికొన్ని రోజుల తర్వాత యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
జనవరి 6న దాదాను డిశ్చార్జి చేసేముందు తొమ్మిది మంది సీనియర్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చించింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని బోర్డు సభ్యులు భావించినట్టు ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు అప్పట్లో వెల్లడించారు. ఈ బోర్డు సమావేశంలో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ దేవి శెట్టి, కేఆర్ పాండా వర్చువల్ వేదికగా హాజరయ్యారని, అమెరికా నుంచి మరో వైద్య నిపుణుడు కూడా ఫోన్లో పాల్గొన్నారని వెల్లడించారు.
ఇవీ చదవండి
ఐపీఎల్ వేలం తేదీ ఖరారు
రూట్.. రైట్ రైట్! కోహ్లీ ఆపగలడా?