
తాజా వార్తలు
సంజూని కెప్టెన్ కాకుండా వైస్‌కెప్టెన్ చేయాల్సింది
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా కాకుండా వైస్ కెప్టెన్‌గా నియమించాల్సిందని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో మాట్లాడుతూ గౌతీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2021 ఐపీఎల్ కోసం రాజస్థాన్ ఇటీవల స్టీవ్‌స్మిత్‌ను కెప్టెన్‌గా తీసేయడమే కాకుండా జట్టు నుంచే తొలగించింది. దీంతో ఆ బాధ్యతలను యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు అప్పగించింది. ఈ విషయంపై స్పందించిన గంభీర్.. స్మిత్‌ను తీసేయడం సరైన నిర్ణయమే అని, అయితే.. సంజూ కెప్టెన్ కావడం తొందరపాటు చర్య అని పేర్కొన్నాడు.
‘రాజస్థాన్ స్మిత్‌ను తొలగించడం సరైందే. అతడు వన్డేలు, టెస్టుల్లో రాణించినంత టీ20ల్లో ఆడలేడు. అతడిని కెప్టెన్‌గా పెట్టి ఓపెనింగ్ చేయిస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. సంజూ విషయానికొస్తే రాజస్థాన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కనిపించలేదు. అయితే, అతడు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు సరైన సమయం కాదు. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్ ఉన్నారు. ఒకవేళ బట్లర్ ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లూ ఆడితే అతడిని కెప్టెన్ చేసి సంజూను వైస్‌కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. రాజస్థాన్ ఈ యువ క్రికెటర్‌ను నమ్మింది. అతడెలా రాణిస్తాడో చూడాలి. రోహిత్‌లా విజయవంతం అవుతాడో లేదో వేచి చూడాలి’ అని గంభీర్ వివరించాడు. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కుల్దీప్ యాదవ్‌ను అట్టిపెట్టుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇటీవల యూఏఈలో జరిగిన 13వ సీజన్లో కుల్దీప్ను కొన్ని మ్యాచ్‌లకే పరిమితం చేసినా ఎందుకు ఉంచుకుందో అర్థం కాలేదని చెప్పాడు.
ఇవీ చదవండి..
‘ఏం కావాలంటే అది చేసుకోండి.. మేం వెళ్లం’
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు..