close
Array ( ) 1

తాజా వార్తలు

విజేతలకు టాయిలెట్‌ పేపర్‌

లాస్‌ ఏంజెలెస్‌: కరోనా కారణంగా అమెరికాలో టాయిలెట్‌ పేపర్లకు ఎంత డిమాండ్‌ ఏర్పడిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న మహిళల గోల్ఫ్‌ లీగ్‌లో విజేతకు నగదుతో పాటు టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ను బహుమతిగా ఇస్తున్నారు. ఒకవైపు కరోనా కలవరపెడుతున్నప్పటికీ అరిజోనా క్లబ్‌లో ఆరంభమైన ఈ లీగ్‌లో ముందస్తు జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తున్నారు.  ‘‘గత వారం జరిగిన పోటీల్లో విజేతగా నిలిచాను. టాయిలెట్‌ పేపర్‌ బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. గుంతల్లో సబ్బు నురగను నింపుతున్నారు దీని వల్ల బంతిని సురక్షితంగా తీసుకుంటున్నాం’’ అని ఈ లీగ్‌లో ఓ అంచె విజేత సారా తెలిపింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.