close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీయూష్‌‌ చావ్లాను చెన్నై ఎందుకు తీసుకుంది?

రూ.6.75 కోట్లు పెట్టి తీసుకోవాల్సిన అవసరమేంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా ఐపీఎల్‌ 2020 వేలంలో అత్యధికంగా అమ్ముడుపోయాడు. కోల్‌కతా అతడిని వదిలేయగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.6.75 కోట్లు వెచ్చించి మరీ తీసుకుంది.  2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో చావ్లా కీలక పాత్ర పోషించాడు. అలాగే మొత్తం 157 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీసి ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మూడో స్థానంలో హర్భజన్‌ సింగ్‌తో సమానంగా నిలిచాడు. ఇదిలా ఉండగా, చెన్నై ఇప్పటికే ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ శాంట్నర్‌, హర్భజన్‌, రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్లున్నా పీయుష్‌ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంతమొత్తం చెల్లించి మరీ ఎందుకు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన చావ్లా స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ సీఎస్కే తనను ఎందుకు తీసుకుందో వివరించాడు. 

మార్చి 29న ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభమవ్వాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీఎస్కే జట్టు తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించింది. ఈ ట్రైనింగ్‌ సెషన్‌కు కెప్టెన్‌ ధోనీ కూడా హాజరయ్యాడు. అప్పుడు తాను కెప్టెన్‌తో మాట్లాడానని, ఆ సందర్భంలో చెన్నై తనను ఎందుకు తీసుకుందని అడిగానని చెప్పాడు. దాంతో ధోనీయే స్వయంగా తనను ఎంపిక చేసినట్లు చెప్పాడని పీయుష్‌ వెల్లడించాడు. కాగా, ఈ స్పిన్‌ బౌలర్‌ ఇంకా చెన్నై తరఫున అరంగేట్రం చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ఆ మెగా టోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటనా వెలువడలేదు. దీంతో చెన్నై తరఫున ఆడేందుకు పీయుష్‌ ఇంకా వేచిచూడక తప్పదు. మరోవైపు ఈ స్పిన్‌ బౌలర్‌ 2007,2011 ప్రపంచకప్‌ల విజేతగా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడు. దీంతో అప్పటి నుంచే ధోనీకి అతడిపై నమ్మకం ఉన్నట్లు అనిపిస్తోంది. 2018లోనే చావ్లాను సీఎస్కేలోకి తీసుకోవాలని చూసినా అప్పుడు కుదరలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సారి భారీ మొత్తం వెచ్చించి మరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.