close

తాజా వార్తలు

Published : 25/09/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిత్తుగా ఓడిపోయిన బెంగళూరు

బౌలింగ్‌లో అదరగొట్టిన పంజాబ్‌
శతకంతో కదం తొక్కిన కేఎల్‌ రాహుల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. తొలుత కేఎల్‌ రాహుల్‌ ‌(132 నాటౌట్‌; 69 బంతుల్లో 14x4, 7x6) భారీ శతకంతో చెలరేగగా తర్వాత ఆ జట్టు బౌలర్లు రెచ్చిపోయారు. రవిబిష్ణోయ్‌(3), మురుగన్‌ అశ్విన్‌(3), షెల్డన్‌ కాట్రెల్‌(2) చెలరేగడంతో ఫలితంగా బెంగళూరు 109 పరుగులకే ఆలౌటైంది. 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. 4 పరుగులకే దేవ్‌దత్‌ పడిక్కల్‌(1), జోష్‌ ఫిలిప్‌(0), విరాట్‌ కోహ్లీ(1) మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. షెల్డన్‌ కాట్రెల్‌, షమి తొలి మూడు ఓవర్లు నిప్పులు చెరడంతో బెంగళూరు ఓవర్‌కి ఒక వికెట్‌ చొప్పున నష్టపోయింది. తర్వాత ఆరోన్‌ ఫించ్‌(20), ఏబీ డివిలియర్స్‌(28) స్కోరును సరిదిద్దే క్రమంలో ఇద్దరూ వెనువెంటనే ఔటయ్యారు. 53 పరుగుల వద్ద ఫించ్‌.. రవిబిష్ణోయ్‌ బౌలింగ్‌లో బౌల్డవ్వగా తర్వాతి ఓవర్‌లోనే డివిలియర్స్‌.. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి సర్ఫరాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో బెంగళూరు 57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌(30), శివమ్‌ దూబె(12) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా అదీ జరగలేదు. దూబె ఔటయ్యాక బెంగళూరు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో 109 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి చివరి వరకు క్రీజులో ఉండి శతకంతో చెలరేగాడు. అతడికి మయాంక్‌ అగర్వాల్‌ (26; 20 బంతుల్లో 4x4) శుభారంభం అందించగా తర్వాత నికోలస్‌ పూరన్ ‌(17; 18 బంతుల్లో 1x4), కరన్‌ నాయర్ ‌(15; 8 బంతుల్లో 2x4) సహకరించారు. దీంతో ఈ ఇన్నింగ్స్‌ అంతా వన్‌మ్యాన్‌ షోగా నిలిచింది. ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ తొలి సెంచరీ నమోదు చేయడం విశేషం. మయాంక్‌, రాహుల్‌ తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించాక చాహల్‌ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఏడో ఓవర్‌ చివరి బంతికి మయాంక్‌ను బౌల్డ్‌ చేశాడు. అనంతరం పూరన్‌తో జోడీ కట్టిన కెప్టెన్‌ రెండో వికెట్‌కు మరో 57 పరుగులు జోడించాడు. 114 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. శివమ్‌దూబె వేసిన 13.1 బంతికి  పూరన్‌ షాట్‌ ఆడబోయి డివిలియర్స్‌ చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన మాక్స్‌వెల్‌ (5) నిరాశపరిచాడు. దూబె బౌలింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇక చివర్లో నాయర్‌.. రాహుల్‌కే ఎక్కువ స్ట్రైకింగ్‌ ఇవ్వడంతో రెచ్చిపోయాడు. స్టెయిన్‌ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లోనే శతకం పూర్తిచేసుకున్నాడు. అయితే, బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అప్పటికే రెండుసార్లు రాహుల్‌ క్యాచ్‌లను విడవడం గమనార్హం. చివరి ఓవర్‌లోనూ అతడు చెలరేగడంతో మరో 23 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్‌ బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.