ఈ బ్యాట్‌లో ఏముంది?

తాజా వార్తలు

Updated : 29/03/2021 08:47 IST

ఈ బ్యాట్‌లో ఏముంది?

పుణె : తన క్రికెట్‌ కెరీర్‌ తొలినాళ్లలో బ్యాట్స్‌మన్‌గా సత్తాచాటిన శార్దూల్‌ ఠాకూర్‌.. ఆ తర్వాత పేసర్‌గా మారాడు. కానీ ఇప్పుడు మళ్లీ తనలోని బ్యాట్స్‌మన్‌ను బయటకు తీస్తూ జట్టు విజయానికి దోహదపడే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఎవరి బౌలింగ్‌లోనైనా సిక్సర్లు కొట్టగలనని చాటుతున్నాడు. మూడో వన్డేలో మూడు సిక్సర్లతో సహా కీలకమైన 30 పరుగులు చేసి జట్టు స్కోరును 300 దాటించాడు. భారత ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ వేసిన 45వ ఓవర్‌ నాలుగో బంతిని మిడాఫ్‌ దిశగా శార్దూల్‌ సిక్సర్‌గా మలిచాడు. దీంతో అతని బ్యాట్‌లో ఏమైనా ఉందా అని సరదాగా స్టోక్స్‌ దాన్ని తీసుకుని పరిశీలించాడు. శార్దూల్‌ బ్యాటింగ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. కృనాల్‌ కంటే ముందు శార్దూల్‌ బ్యాటింగ్‌కు రావాల్సిందని, లార్డ్‌ శార్దూల్‌ జట్టును మరోసారి రక్షించాడని, అతను భారత్‌ తరపున ఓపెనింగ్‌ లేదా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలనే పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని