Cricket News: కార్తీక్‌ వ్యాఖ్యానంపై దుమారం

తాజా వార్తలు

Published : 03/07/2021 07:49 IST

Cricket News: కార్తీక్‌ వ్యాఖ్యానంపై దుమారం

లండన్‌: వ్యాఖ్యాతగా మారిన టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే వ్యాఖ్యాతగా కెరీర్‌ ఆరంభించి.. న్యూజిలాండ్, టీమ్‌ఇండియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న అతను.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లాండ్, శ్రీలంకతో గురువారం ముగిసిన రెండో వన్డే సందర్భంగా వ్యాఖ్యాతగా ఉన్న అతను.. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ‘‘బ్యాట్స్‌మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేవి రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి’’ అని దినేశ్‌ వ్యాఖ్యానించాడు. దీంతో అతనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. బ్యాట్లను పరాయి పురుషుల భార్యలతో పోల్చి చూడడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని