Tokyo olympics: జుడోకాకు కోచ్‌ చెంప దెబ్బలు 

తాజా వార్తలు

Updated : 30/07/2021 06:46 IST

Tokyo olympics: జుడోకాకు కోచ్‌ చెంప దెబ్బలు 

టోక్యో: ఒలింపిక్స్‌లో ఓ జుడోకా పట్ల ఆమె కోచ్‌ వ్యవరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. బరిలోకి దిగడానికి ముందు జుడోకా మార్టిన్‌ ట్రడోస్‌ (జర్మనీ) కాసేపు ఆగింది. అప్పుడు ఆమెను ఉత్సాహపరచడం కోసం కోచ్‌ ఆమె యూనిఫామ్‌ను పట్టుకుని గట్టిగా కుదిపేసి, ఆపై రెండు చెంపలపై చురుక్కుమనేలా కొట్టాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కొంతమంది కోచ్‌ చర్యను తప్పు పట్టారు కూడా. కానీ ట్రడోస్‌ మాత్రం తన కోచ్‌ను సమర్థించింది. ‘‘నాలో కసి పుట్టించడానికి నా కోచ్‌ నేను కోరుకున్నదే చేశాడు. నేను మరో రకంగా వార్తల్లో నిలిస్తే బాగుండేది. ప్రతి పోటీకి ముందు కూడా నా కోరిక మేరకు నా కోచ్‌ ఇలాగే చేస్తాడు’’ అని ట్రడోస్‌ తెలిపింది. 63 కేజీ బౌట్లో ఆమె హంగేరికి చెందిన జోఫి ఒజ్బాస్‌ చేతిలో ఓడిపోయింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని