close

తాజా వార్తలు

Published : 31/10/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సన్‌రైజర్స్‌కు చావోరేవో

ఆర్‌సీబీతో పోరు నేడు

షార్జా: ఐపీఎల్‌-13 ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శనివారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్‌కు దూరమవుతుంది. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ జట్టు.. ఆర్‌సీబీపై కూడా అదే జోరు కొనసాగిస్తుందన్న ఆశతో అభిమానులున్నారు. మరోవైపు 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లిసేన.. సన్‌రైజర్స్‌తో పోరులో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మధ్యాహ్నం మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న దిల్లీ.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ బెర్త్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ముంబయి ఇప్పటికే ప్లేఆఫ్‌ చేరిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.