ఆ ఆరుగురికి కార్లు అందజేత

తాజా వార్తలు

Updated : 03/04/2021 09:22 IST

ఆ ఆరుగురికి కార్లు అందజేత

దిల్లీ: ఆస్ట్రేలియాపై సత్తా చాటి భారత్‌ టెస్టు సిరీస్‌ నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు యువ ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవ్‌దీప్‌ సైని.. మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ కార్లు అందుకున్నారు. కంగారూలపై చారిత్రాత్మక ప్రదర్శన అనంతరం ఈ సిరీస్‌లో అదరగొట్టిన ఈ ఆరుగురు కుర్రాళ్లకు కార్లు ఇస్తున్నట్లు గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆయన సొంత ఖర్చుతో కార్లు అందజేశారు. మహీంద్ర కారు అందుకున్నట్లు చెబుతూ యువ పేసర్లు నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ట్విటర్‌లో ఫొటోలు పోస్టు చేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి టెస్టు ఓడినా.. తర్వాత టెస్టును గెలిచిన భారత్‌.. గొప్ప పోరాటంతో మూడో టెస్టును డ్రా చేసుకుంది. చివరిదైన నాలుగో టెస్టులో అద్భుత విజయంతో సిరీస్‌ను నిలబెట్టుకుంది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని