ఐపీఎల్‌ నుంచి వైదొలగిన అంపైర్‌ మేనన్‌
close

తాజా వార్తలు

Published : 30/04/2021 02:19 IST

ఐపీఎల్‌ నుంచి వైదొలగిన అంపైర్‌ మేనన్‌

దిల్లీ: ఐపీఎల్‌ బయో బబుల్‌ నుంచి నిష్క్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మ్యాచ్‌ రిఫరీ మను నయ్యర్‌, టాప్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలగారు. తల్లి మరణంతో నయ్యర్‌ బబుల్‌ నుంచి వెళ్లిపోయాడు. అతడు చివరగా మంగళవారం దిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో విధులు నిర్వర్తించాడు. ఆయన తల్లి నిద్రలోనే కన్నుమూసినట్లు ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.  ఇక నితిన్‌ మేనన్‌ తన భార్య, తల్లికి కొవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో బయో బబుల్‌ వీడినట్లు తెలుస్తోంది. మరో అంపైర్‌ రీఫిల్‌ (ఆస్ట్రేలియా) ఐపీఎల్‌ను వీడాలనుకున్నా ఆస్ట్రేలియా ప్రయాణ ఆంక్షల కారణంగా వెళ్లలేకపోయాడు. రీఫిల్‌ తన పరిస్థితి గురించి మాట్లాడుతూ..    ‘‘దోహాకు వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్దామనుకున్నా. ఇప్పుడు ఆ అవకాశం లేదు. టికెట్‌ రద్దు చేసుకున్నా. ఇంకో 10 నిమిషాల్లో బబుల్‌ను వీడతాననగా ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం లేదని తెలిసింది. అదృష్టం’’ అని రీఫిల్‌ చెప్పాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని