వాళ్లతో పాటే మేమూ వెళ్లొచ్చు: మ్యాక్స్‌వెల్‌
close

తాజా వార్తలు

Published : 01/05/2021 01:52 IST

వాళ్లతో పాటే మేమూ వెళ్లొచ్చు: మ్యాక్స్‌వెల్‌

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ క్రికెటర్లతో పాటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో బ్రిటన్‌కు వెళ్లొచ్చని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వ్యాఖ్యానించాడు. ‘‘స్వదేశం వెళ్లడానికి మార్గం కనుక్కోవాలి. బీసీసీఐ, ఇరు దేశాల ప్రభుత్వాలు పరిష్కారం కనుగొనచ్చు. కొంత సమయం ఎదురుచూడాల్సి వచ్చినా ఫర్వాలేదు. ఏదో ఒక దశలో ఇంటికి వెళ్లడానికి మార్గం దొరుకుతుంది. ఇంగ్లాండ్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. నాతో పాటు మిగతా ఆసీస్‌ ఆటగాళ్లు టీమ్‌ఇండియా, కివీస్‌, ఇంగ్లాండ్‌ క్రికెటర్లతో ప్రత్యేక విమానంలో బ్రిటన్‌కు వెళ్లొచ్చు. అక్కడ్నుంచి స్వదేశం చేరుకోవచ్చు’’ అని మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. మ్యాక్స్‌వెల్‌ ఆలోచన పరిశీలించదగినదే అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అన్నాడు. ‘‘ఇంగ్లాండ్‌కు వెళ్లి.. అక్కడ్నుంచి ఆస్ట్రేలియాకు పయనమవడం ఆలోచించదగిన ప్రత్యామ్నాయం. బోర్డు ముందు చాలా ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీపడకుండా అత్యుత్తమమైన సురక్షిత మార్గాన్ని బీసీసీఐ ఎంపిక చేస్తుంది’’ అని ధుమాల్‌ తెలిపాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని