వార్నర్‌ దారెటు?

తాజా వార్తలు

Published : 03/05/2021 02:04 IST

వార్నర్‌ దారెటు?

కెప్టెన్‌గా తప్పించారు.. కనీసం ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. మొన్నటి వరకు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ వార్నర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో డగౌట్‌కే పరిమితమయ్యాడు. భుజంపై తువ్వాలు వేసుకుని.. తోటి ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందిస్తూ.. జట్టు మంచి ప్రదర్శన చేసినప్పుడల్లా చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ కనిపించాడు. తుది జట్టు నుంచి తనను తప్పించడం పట్ల వార్నర్‌ షాక్‌కు గురయ్యాడని సన్‌రైజర్స్‌ ఫ్రాంఛైజీ క్రికెట్‌ డైరెక్టర్‌ టామ్‌ మూడీ వెల్లడించినప్పటికీ.. ఆ బాధను అతడు ఎక్కడ కనిపించకుండా సరదాగా తిరిగాడు. ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఆడినా ఫామ్‌ ఆధారంగా వార్నర్‌ను పక్కన పెట్టడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి ఇప్పుడూ అతడి పామ్‌ పేలవంగా ఏమీ లేదు. ఫ్రాంఛైజీ వివరణ ఎలా ఉన్నప్పటికీ అంతర్గత విభేధాల కారణంగానే అతడిపై వేటు పడిందన్నది వాస్తవం. ఇప్పుడిప్పుడే అతడికి ఆడే అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు. మనీష్‌ను తుది జట్టులో ఆడించకపోవడంపై వార్నర్‌ బహిరంగంగానే అసంతృప్తి ఫ్రాంఛైజీకి కోపం తెప్పించివుండొచ్చు. అయితే ఈ ఒక్క కారణంతోనే సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ వార్నర్‌ను తప్పిస్తుందని అనుకోలేం. అతడి విభేదాలు మూడీ వరకే పరిమితం కాలేదని తెలుస్తోంది.

‘‘సన్‌రైజర్స్‌ బృందంలో చాలా మంది నాయకులున్నారు. మేం కలిసి కట్టుగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైన మార్పులు చేస్తూ జట్టును పటిష్ఠంగా నిర్మించడం మాకు అవసరం. విజయం కోసం అతిగా వెతకడం కంటే కూడా మేం ఎలా ఆడుతున్నామనేది ప్రధానం. వార్నర్‌ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను మా పరిగణలోనే ఉన్నాడు. తనను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చర్చలు సాగుతాయని అనుకుంటున్నా’’ 

 - సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని