రాహుల్‌కు అపెండిసైటిస్‌
close

తాజా వార్తలు

Published : 03/05/2021 02:04 IST

రాహుల్‌కు అపెండిసైటిస్‌

అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలింది. అపెండిసైటిస్‌తో ఆస్పత్రిపాలైన ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. కనీసం రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మొత్తం టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్‌ అనారోగ్యం గురించి పంజాబ్‌ ఫ్రాంఛైజీ ట్విట్టర్లో ప్రకటించింది. ‘‘గత రాత్రి రాహుల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అది అపెండిసైటిస్‌ అని పరీక్షల్లో తేలింది. రాహుల్‌ను ఆస్పత్రికి తరలించాం. అక్కడ అతడికి శస్త్రచికిత్స జరగనుంది’’ అని పంజాబ్‌ ఆదివారం ట్వీట్‌ చేసింది. రాహుల్‌ ప్రస్తుతం ఏడు మ్యాచ్‌ల్లో 331 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌లో రెండో స్థానంలో ఉన్నాడు.  రాహుల్‌ గైర్హాజరీలో మయాంక్‌ అగర్వాల్‌ పంజాబ్‌కు నాయకత్వం వహిస్తాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని