లండన్‌ చేరుకున్న ఇంగ్లిష్‌ క్రికెటర్లు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:55 IST

లండన్‌ చేరుకున్న ఇంగ్లిష్‌ క్రికెటర్లు

దిల్లీ: ఐపీఎల్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు లండన్‌ చేరుకున్నారు. టోర్నీలో మొత్తం 12 మంది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఉండగా.. గాయంతో టోర్నీకి దూరమైన బెన్‌ స్టోక్స్‌ అందరి కంటే ముందు స్వదేశానికి వెళ్లిపోయాడు. టోర్నీ వాయిదా పడ్డాక ఎనిమిది మంది భారత్‌ నుంచి బయల్దేరి లండన్‌ చేరుకున్నారు. జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌, జానీ బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌, సామ్‌ బిల్లింగ్స్‌ ఈ బృందంలో ఉన్నారు. ఇయాన్‌ మోర్గాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, డేవిడ్‌ మలన్‌ ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి బయల్దేరతారని తెలుస్తోంది. లండన్‌ చేరుకున్న ఇంగ్లిష్‌ క్రికెటర్లు పది రోజుల పాటు హోటల్లో క్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాత తమ ఇళ్లకు చేరుకోనున్నారు. ఇక న్యూజిలాండ్‌ క్రికెటర్లలో సగం మంది నేరుగా స్వదేశానికి వెళ్లనున్నారు. మరో సగం మంది లండన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ప్రయాణ ఆంక్షల వల్ల వాళ్లు     మే 10 వరకు భారత్‌లోనే ఉండాల్సి రావచ్చు. జూన్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లాండ్‌లో భారత్‌తో ప్రపంచ    టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాల్సి ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని