IPL: దసరా ధమాకా!
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 06:07 IST

IPL: దసరా ధమాకా!

అక్టోబరు 15న ఐపీఎల్‌ ఫైనల్‌
డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల కుదింపు

దిల్లీ: అర్ధంతరంగా నిలిచిన ఐపీఎల్‌ను యూఏఈలో పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పగటి పూట మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించి.. ఐపీఎల్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని భావిస్తోంది. గతంలో అనుకున్నట్లే సెప్టెంబరు 19న ఐపీఎల్‌ ప్రారంఛించాలన్నది ఆలోచన. అయితే అక్టోబరు 10న నిర్వహించాలనుకున్న ఫైనల్‌ను 5 రోజుల తర్వాత, దసరా రోజున జరిపేందుకు బీసీసీఐ, యూఏఈ ప్రణాళికలు రచిస్తున్నాయి. అక్టోబరు 15న శుక్రవారం యూఏఈలో సెలవు రోజు కావడం.. భారత్‌లో విజయ దశమి ఉండటంతో అత్యధికంగా అభిమానులు ఫైనల్‌ను వీక్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ‘‘సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15లోపు ఐపీఎల్‌ నిర్వహించాలన్నది ప్రణాళిక. 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని తొలుత బీసీసీఐ అనుకుంది. సెప్టెంబరు మూడు, నాలుగు వారాల్లో 10 మధ్యాహ్నం మ్యాచ్‌లు నిర్వహిస్తే ఎండ తీవ్రత కారణంగా ఆటగాళ్లు శారీరకంగా తీవ్రంగా అలసిపోయే ప్రమాదముంది. అక్టోబరు 15 శుక్రవారం. భారత్‌, దుబాయ్‌లో వారాంతం మొదలవుతుంది. యూఏఈలో సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి తరలివచ్చే అవకాశముంది. డబుల్‌ హెడర్‌ల సంఖ్య పదికి బదులు అయిదు లేదా ఆరుకు తగ్గుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని