Olympics: తొలి వ్యక్తిగత పతకం అందించిన జాదవ్‌ గుర్తున్నాడా?

తాజా వార్తలు

Updated : 23/07/2021 08:38 IST

Olympics: తొలి వ్యక్తిగత పతకం అందించిన జాదవ్‌ గుర్తున్నాడా?

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ సందడిలో ప్రజలంతా మునిగిపోయారు. భారత అథ్లెట్లు ఎన్ని పతకాలు గెలుస్తారు? స్వర్ణాలు వస్తాయా? అనే చర్చలు జోరందుకున్నాయి. కానీ స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత పతకం అందించిన దిగ్గజం గురించి ఎంతమందికి తెలుసు? శుక్రవారం టోక్యో క్రీడల ఆరంభోత్సవం రోజే ఆయన దేశానికి పతకం అందించిన 69వ వార్షికోత్సవం కావడం విశేషం. ఆయనే.. కసాబా దాదాసాహెబ్‌ జాదవ్‌. కేడీ జాదవ్‌గా సుపరిచితమైన ఆయన 1952 ఒలింపిక్స్‌లో జులై 23నే పురుషుల రెజ్లింగ్‌ 52 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గారు. కానీ ఆయన దేశానికి చేసిన సేవకు ఇప్పటికీ గుర్తింపు రాలేదని జాదవ్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన జాదవ్‌ 1984లో ఓ ప్రమాదంలో చనిపోయారు. ఆయనకు మరణానంతరం 2001లో అర్జున అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. దిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని రెజ్లింగ్‌ స్టేడియానికి 2010లో ఆయన పేరు పెట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని