Tokyo Olympics: భార్యాభర్తలు రజతాలు పట్టారు

తాజా వార్తలు

Updated : 04/08/2021 07:58 IST

Tokyo Olympics: భార్యాభర్తలు రజతాలు పట్టారు

టోక్యో: ఒలింపిక్స్‌లో ఒక పతకం వస్తేనే గొప్ప.. అలాంటిది ఒకే ఇంట్లో రెండు పతకాలు వస్తే! బ్రిటన్‌ భార్యాభర్తలు జాసన్‌ కెన్నీ, లౌరా దీన్ని నిజం చేశారు. వాళ్లిద్దరికి ఇదే కొత్త కాదు. గత కొన్ని ఒలింపిక్స్‌ల నుంచి ఈ జోడీ పతకాల పంట పండిస్తూనే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సైక్లింగ్‌లో జాసన్‌ రజతం సాధించిన 20 నిమిషాల వ్యవధిలోనే లౌరా రజతం గెలవడం విశేషం. పురుషుల టీమ్‌ స్ప్రింట్‌లో బ్రిటన్‌ రెండో స్థానంలో నిలవగా, మహిళల టీమ్‌ పర్స్యూట్‌లోనూ బ్రిటన్‌ అదే స్థానాన్ని సాధించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో పసిడి పతకాలు గెలిచిన లౌరా.. రియోలోనూ ఆ ఫీట్‌ను పునరావృతం చేసింది. ఇప్పుడు టోక్యోలోనూ రజతంతో మెరిసింది. ఇక బీజింగ్‌లో టీమ్‌ పసిడి.. స్ప్రింట్‌ రజతం, లండన్‌లో టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు సాధించిన జాసన్‌ కెన్నీ.. రియోలో టీమ్‌, స్ప్రింట్‌, కెరిన్‌ విభాగాల్లో పసిడి పతకాలతో సంచలనం సృష్టించాడు. టోక్యోలో టీమ్‌ స్ప్రింట్‌లో అతడు రజతం గెలిచాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని