Teamindia:జిమ్‌లో చెమటోడ్చుతున్న ఆటగాళ్లు..
close

తాజా వార్తలు

Published : 27/05/2021 00:23 IST

Teamindia:జిమ్‌లో చెమటోడ్చుతున్న ఆటగాళ్లు..

ఇంటర్నెట్ డెస్క్‌: సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా ఆటగాళ్లు  సిద్ధమవుతున్నారు. మంగళవారమే  ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్ హయత్‌ హోటల్‌లో కఠిన క్వారంటైన్‌లోకి వెళ్లారు. మూడుసార్లు ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు నిర్వహించిన అనంతరం జూన్‌ 2న ఛార్టెడ్‌ విమానంలో ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. అయితే, ఈ మధ్యలో ఉన్న ఖాళీ సమయాన్ని ఆటగాళ్లు వృథా చేయడం లేదు. దేహధారుడ్యాన్ని పెంచుకుంటూ  ఫిట్‌గా ఉండేందుకు ఉపయోగించుకుంటున్నారు.  జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఆటగాళ్లు జిమ్‌లో చేస్తున్న వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియో బీసీసీఐ  తన అధికారిక ట్విటర్‌లో బుధవారం  పోస్టు చేసింది. ఈ వీడియోలో టీమ్‌ఇండియా జంబో మ్యాన్‌, పేసర్‌ ఇషాంత్ శర్మ, శుభమన్‌ గిల్, రిషబ్‌ పంత్, మహ్మద్ షమి, ఉమేశ్‌ యాదవ్‌, అజింక్యా రహానే, మహ్మద్‌ సిరాజ్‌, మయాంక్‌ అగర్వాల్..తదితరులు వర్కౌట్స్‌ చేస్తూ చెమటోడ్చుతున్నారు. ఈ పర్యటనలో  టీమిండియా 6 టెస్టులు ఆడనుంది. మొదట  సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. అనంతరం అతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని