అరంగేట్రం ముందు రాత్రి నిద్రమాత్ర వేసుకున్న గిల్‌!

తాజా వార్తలు

Published : 29/01/2021 02:05 IST

అరంగేట్రం ముందు రాత్రి నిద్రమాత్ర వేసుకున్న గిల్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటైనప్పుడు ఎలా స్పందించాలో జట్టుకు అర్థమవ్వలేదని టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. దాన్ని అరాయించుకొనేందుకూ సరైన సమయం దొరకలేదని పేర్కొన్నాడు. అరంగేట్రానికి ముందురోజు రాత్రి తనకు నిద్రపట్టలేదని తెలిపాడు. ఫలితంగా నిద్రమాత్ర వేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. తొలి మ్యాచులో గిల్‌ 45, 35*తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

‘టీమ్‌ఇండియా 36కు ఆలౌటైనప్పుడు మేమంతా షాకయ్యాం. అత్యంత వేగంగా కుప్పకూలడంతో ఎలా స్పందించాలో తెలియలేదు. దానిని అరాయించుకొనేందుకూ మాకు సమయం చిక్కలేదు. మ్యాచులో సౌకర్యవంతమైన స్థితిలో ఉండగా ఒక్క గంటలో అంతా మారిపోయింది. మీడియాలో ది గ్రేట్‌ అడిలైడ్‌ కొలాప్స్‌ అనే వాక్యాలు చదివినప్పుడు బాధేసింది. ఈ సిరీసును గుర్తుపెట్టుకోవద్దని అనిపించింది’ అని గిల్‌ చెప్పాడు.

అరంగేట్రం మ్యాచులో గిల్‌ అదరగొట్టాడు. ఆ తర్వాత బ్రిస్బేన్‌లో త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. విజయానికి మాత్రం బాటలు వేశాడు. ‘మెల్‌బోర్న్‌లో అరంగేట్రం చేస్తానని అడిలైడ్‌ మ్యాచుకు ముందే తెలుసు. దాంతో మ్యాచుకు ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దాంతో నిద్రమాత్ర వేసుకున్నాను. ఉదయం మేం తొలుత ఫీల్డింగ్‌ చేయాల్సి వచ్చింది. జట్టంతా మైదానంలో ఉండటంతో నాకు అరంగేట్రం చేస్తున్న అనుభూతి కలగలేదు. సాయంత్రం బ్యాటింగ్‌కు దిగినప్పుడు 10-12 బంతులు ఎదుర్కొన్నంత వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్నానన్న ఆత్రుత కలిగింది. అత్యుత్తమ బౌలింగ్‌ దాడిని ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. నేను మరింత శ్రద్ధగా ఆడాలని ఆ తర్వాత నాకు నేనే చెప్పుకున్నా’ అని గిల్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
దాదాకు మరో 2 స్టెంట్లు అమర్చిన వైద్యులు
ఆసీస్‌ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని