Tokyo Olympics: బ్రేకప్‌ చెప్పినందుకు చింతిస్తున్నా: అథ్లెట్‌ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌

తాజా వార్తలు

Published : 30/07/2021 01:15 IST

Tokyo Olympics: బ్రేకప్‌ చెప్పినందుకు చింతిస్తున్నా: అథ్లెట్‌ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌

వెల్లింగ్టన్‌: ఎవరి జీవితాలు ఎప్పుడెలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకే ఒకరిని ప్రేమిస్తే.. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వదిలేయకూడదు. వదిలేసిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఓ అథ్లెట్‌ మాజీ ప్రేయసికి ఎదురైంది. ఒకప్పుడు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు ఆ అథ్లెట్‌ పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలవడంతో అతడిని వదులుకున్నందుకు బాధపడుతోంది. లక్షలాది మంది వీక్షిస్తున్న టీవీ ప్రత్యక్ష ప్రసారంలోనే తన మనసులో మాటను చెప్పేసింది. 

న్యూజిలాండ్‌కు చెందిన హెడెన్‌ వైల్డ్‌ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ట్రైయథ్లాన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. దీంతో ఓ టీవీ ఛానెల్‌ వైల్డ్‌ స్వగ్రామానికి వెళ్లి అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే ఓ అమ్మాయితో ఛానెల్‌ రిపోర్టర్‌ మాట్లాడారు. ఆమె ఎవరో కాదు.. వైల్డ్‌ మాజీ ప్రేయసి. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్న వారిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారట. ఆ తర్వాత ఆమె వైల్డ్‌కు బ్రేకప్‌ చెప్పింది. అయితే, ఇప్పుడు వైల్డ్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని రిపోర్టర్‌ అడగగా.. నేరుగా కెమెరాను చూస్తూ ‘‘నీకు బ్రేకప్‌ చెప్పినందుకు చింతిస్తున్నాను’’అని చెప్పింది. అనంతరం తనలోని బాధను దిగమింగుకొని నవ్వుతూ.. వైల్డ్‌ను చూసి గర్విస్తున్నానని తెలిపింది. అయితే, వైల్డ్‌తో తిరిగి ప్రేమలో పడే అవకాశం.. పాపం ఆ అమ్మాయికి లేకుండా పోయింది. ఎందుకంటే ప్రస్తుతం వైల్డ్‌ స్పెయిన్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని