Raina: లక్ష్యాలు ఛేదించడం ఛాపెలే నేర్పించాడు
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raina: లక్ష్యాలు ఛేదించడం ఛాపెలే నేర్పించాడు

గెలుపు ప్రాముఖ్యం బోధించాడు: సురేశ్‌ రైనా

ముంబయి: వన్డే క్రికెట్లో లక్ష్యాలను ఎలా ఛేదించాలో మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ నేర్పించారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. బృంద చర్చల్లో నిరంతరం బ్యాటింగ్‌, భాగస్వామ్యాల ప్రాముఖ్యం వివరించేవాడని పేర్కొన్నాడు. విజయాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించాడన్నాడు. తన ఆత్మకథ ‘బిలీవ్‌’లో ఈ వివరాలు పొందుపరిచాడు.

‘గ్రెగ్‌ ఛాపెల్‌ కోచింగ్‌ కెరీర్‌ వివాదాల మయం కావొచ్చు. కానీ విజయాలు ఎలా సాధించాలో టీమ్‌ఇండియాకు అతడు నేర్పించాడు. విజయం ప్రాముఖ్యతను బోధించాడు. నిజానికి మేమంతా అప్పుడు బాగా ఆడుతున్నాం. లక్ష్య ఛేదనల్లో బ్యాటింగ్‌, భాగస్వామ్యాల గురించి అతడు నొక్కి చెప్పడం నాకు గుర్తుంది’ అని ‘బిలీవ్‌’ పుస్తకంలో రైనా రాశాడు.

భారత క్రికెట్లో గ్రెగ్‌ ఛాపెల్‌, సౌరవ్‌ గంగూలీ విభేదాల గురించి అందరికీ తెలిసిందే.  కాగా ఛాపెల్‌ కోచింగ్‌లోనే సురేశ్‌ రైనా అరంగేట్రం చేశాడు. దంబుల్లాలో శ్రీలంకతో తొలి వన్డే ఆడాడు. ఆ పోరులో విఫలమైనా కెరీర్లో 226 వన్డేలు ఆడటం గమనార్హం. 35.31 సగటుతో 5,615 పరుగులు సాధించాడు. తన స్పిన్‌ బౌలింగ్‌తో 36 వికెట్లు పొడగొట్టాడు.

ఇక ఛాపెల్‌ కోచింగ్‌లో 2005, సెప్టెంబర్‌ 2 నుంచి 2006, మే 18 వరకు భారత్‌ వరుసగా 17 వన్డేల్లో లక్ష్యాలను ఛేదించడం ప్రత్యేకం.  వీటికి రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యం వహించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని