Sachin Tendulkar: ఇంతకీ మాస్టర్‌ వంటకం పేరేంటి?

తాజా వార్తలు

Published : 10/07/2021 14:56 IST

Sachin Tendulkar: ఇంతకీ మాస్టర్‌ వంటకం పేరేంటి?

ఇన్‌స్టాగ్రామ్‌లో వంట వీడియో పంచుకున్న సచిన్‌

ముంబయి: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ‘మాస్టర్‌ చెఫ్‌’ అవతారం ఎత్తారు! తన మిత్రుల కోసం ఓ పసందైన వంటకం సిద్ధం చేశారు. ఐతే ఆ వంటకం ఏంటో తనకే తెలియదని.. ఇక కడుపులోకి పోవడమే ఆలస్యమని అంటున్నారు.

ప్రస్తుతం సచిన్‌ ఇంట్లోంచి బయటకు వెళ్లడం లేదు. కరోనా ఆంక్షలు, వైరస్‌ వల్ల కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నారు. కాలక్షేపం కోసం ఇంటి పనులు చేస్తున్నారు. తోటలో మొక్కలకు నీరు పెడుతున్నారు. పండిన పండ్లను తెంపి రుచి చూస్తున్నారు. తాజాగా ఆయన వంటగదిలోకి ప్రవేశించారు.

శుక్రవారం సాయంత్రం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. తన మిత్రుల కోసం వంట చేస్తున్నానని చెప్పారు. ‘అందరికీ ఇదో సర్‌ప్రైజ్‌. నేనేం వండుతున్నానో ఎవరికీ తెలియదు. నిజానికి నాకూ తెలియదు! అందుకని నేనేం బాధపడటం లేదు. ఇప్పుడు బ్యాట్స్‌మన్‌ నిలదొక్కుకున్నాడు (వంటకం తయారవుతుండగా..). ఇక బౌలర్లు వారిని వారే రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ కళలో నేను ఆరితేరాను. ఇందుకు కొంచెం సమయం కావాలంతే’ అని సచిన్‌ అన్నారు.

సచిన్‌ వీడియోకు అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏ వంటకం చేస్తున్నారని, వీడియో ఎవరు తీస్తున్నారని, మీరు గొప్పవారని అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని