Bhavina Patel: భవీనాకు గుజరాత్‌ ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకం.. ఎంతంటే?

తాజా వార్తలు

Published : 29/08/2021 23:57 IST

Bhavina Patel: భవీనాకు గుజరాత్‌ ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకం.. ఎంతంటే?

అహ్మదాబాద్‌: అద్వితీయ ప్రదర్శనతో టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భవీనాబెన్‌ పటేల్‌కు గుజరాత్‌ ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. భవీనాకు రూ.3 కోట్లు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ‘పారాలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన గుజరాత్‌ ముద్దుబిడ్డ భవీనాబెన్‌ పటేల్‌కు ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రశంసలు తెలియజేశారు’ అని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విశ్వక్రీడల్లో ఆమె సాధించిన విజయానికిగానూ ‘దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన’ పథకం కింద సీఎం రూ.3 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించినట్లు వెల్లడించింది.

పారాలింపిక్స్‌లో భవీనాబెన్‌ పటేల్‌ చరిత్ర సృష్టించింది. టేబుల్‌ టెన్నిస్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత ప్యాడ్లర్‌గా ఆమె నిలిచింది. మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలైన ఆమె విశేషంగా పుంజుకొని వరుస విజయాలు సాధించింది. తనకంటే మెరుగైన ర్యాంకింగ్స్‌ ఉన్న ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈ విజయం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు భవీనా పటేల్‌కు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని