
తాజా వార్తలు
పాండ్య సోదరులకు పితృ వియోగం..
(Photo: Hardik Pandya Twitter)
ముంబయి: టీమ్ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తండ్రి శనివారం ఉదయం కన్నుమూశారు. హిమాన్షు పాండ్యకు శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. హార్దిక్ గతనెలలోనే ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాక తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. కృనాల్ బరోడా తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మృతి వార్త తెలియగానే బయోబబుల్ వదిలి ఇంటికి చేరుకున్నాడు.
గతేడాది జూన్ 21న హార్దిక్ పాండ్య ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘ఎన్ని రోజులు గడిచినా.. తండ్రి ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మా కోసం ఆయన చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు. ఆయన పెదవులపై చిరునవ్వులు చూడడానికి ఏమైనా చేస్తా’ అని హార్దిక్ అప్పట్లో ట్వీట్ చేశాడు.
ఇవీ చదవండి..
రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369