టీమ్‌ఇండియాకు షాక్‌: హర్మన్‌ప్రీత్‌కు కరోనా

తాజా వార్తలు

Updated : 30/03/2021 14:55 IST

టీమ్‌ఇండియాకు షాక్‌: హర్మన్‌ప్రీత్‌కు కరోనా

(Photo: Harmanpreet Kaur Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టీ20 మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కరోనా సోకింది. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిసింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతుండటంతో సోమవారం కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారని.. దాంతో ఈ ఉదయం పాజిటివ్‌గా తేలిందని ఆమె సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆడిన హర్మన్‌ చివరి మ్యాచ్‌లో గాయపడింది. దీంతో టీ20 సిరీస్‌లో ఆడకుండా ఇంటికి చేరింది. వన్డే సిరీస్‌లో ఆడినన్ని రోజులు ఆమె నిరంతరం కరోనా పరీక్షలు చేసుకుందని, ఇంటికి వచ్చాకే వైరస్‌ బారిన పడిందని వారు పేర్కొన్నారు. మరోవైపు రోడ్‌సేఫ్టీ సిరీస్‌లో ఆడిన టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు.. సచిన్‌ తెందూల్కర్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌తో పాటు తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని