పసిడి పతకం కొట్టు.. ₹6 కోట్లు పట్టు..!

తాజా వార్తలు

Updated : 24/06/2021 04:54 IST

పసిడి పతకం కొట్టు.. ₹6 కోట్లు పట్టు..!

చండీగఢ్‌: టోక్యో వేదికగా త్వరలో జరగబోయే ఒలింపిక్‌ క్రీడల్లో పతకాల పంట పండించే క్రీడాకారులకు హరియాణా ప్రభుత్వం అదిరిపోయే బహుమతి ఇస్తామని ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ.6 కోట్లు, రజతం సాధించినవారికి రూ.4 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.2.50 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించింది. ‘అంతర్జాతీయ ఒలింపిక్స్ డే’ను పురస్కరించుకొని హరియాణా ప్రభుత్వం బుధవారం పలు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మరోహర్‌లాల్‌ ఖట్టర్‌, క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ సింగ్‌ మాట్లాడుతూ.. రానున్న ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి నగదు పురస్కారం గురించి వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే రాష్ట్రానికి చెందిన 30 మంది క్రీడాకారులకు.. సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే రూ.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేసినట్లు తెలిపారు. 

అంతర్జాతీయ క్రీడా వేదికలపై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా విజేతలకు ప్రభుత్వ ఉద్యోగాలు సహా స్టేడియాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని