Neeraj Chopra: అదృష్టవంతుడినే.. కానీ!
close

తాజా వార్తలు

Published : 13/05/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Neeraj Chopra: అదృష్టవంతుడినే.. కానీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండేళ్లుగా అంతర్జాతీయ పోటీలేమీ లేవని భారత అగ్రశ్రేణి జావెలిన్‌ క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా అన్నాడు. పటియాలాలో ఇండోర్‌లో సాధన చేసుకొనే అవకాశం లేదన్నాడు. మైదానంలో సాధన చేద్దామంటే భరించలేనంత వేడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తొలిసారి ఒలింపిక్స్‌కు వెళ్తుండటంతో సానుకూల దృక్పథంతో ఉన్నానని తెలిపాడు.

‘ప్రతి అథ్లెట్‌కు ఇది కష్టమే. ఎందుకంటే పోటీ పడేందుకు టోర్నీలే ఉండటం లేదు. ఒక పోటీలో పాల్గొని ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు నేను అదృష్టవంతుడినే. దేశంలో కొవిడ్‌కు సంబంధించిన వార్తలు మనసుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వార్తలు చూడడం మానేసి  కేవలం ఆటపైనే దృష్టి సారించాను. ఒలింపిక్స్‌ జరుగుతాయో లేదో ఇప్పటికీ తెలియదు. ఏదేమైనా మేం బాగా సాధన చేస్తున్నాం’ అని నీరజ్‌ అన్నాడు.

‘పోటీలు లేకపోతే సాధనతో ఉపయోగం ఏముంది? నేనో అంతర్జాతీయ పోటీలో పాల్గొని రెండేళ్లైంది. ఒలింపిక్స్‌ ఆడిన అనుభవం నాకు లేదు. విదేశాల్లో చేసిన సాధన బాగుంది. ప్రస్తుతం ఉన్న జావెలిన్‌  క్రీడాకారులు బాగా ఆడుతున్నారు. 87 లేదా 88 మీటర్లు విసురుతున్నారు. నేనూ నిలకడగా 85 మీటర్లకు పైనే విసురుతున్నా. 90 మీటర్ల మార్క్‌ను అందుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. సాధారణంగా చిన్న చిన్న దేశాల్లోనూ ఇండోర్‌ సౌకర్యాలు ఉంటున్నాయి. పటియాలాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువమంది సాధన చేస్తున్నారు. ఇండోర్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుంది’ అని నీరజ్‌ తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని