పంత్‌ ఆటకోసమే టెస్ట్‌ మ్యాచ్‌లు చూస్తా: మిల్స్‌
close

తాజా వార్తలు

Published : 29/05/2021 01:40 IST

పంత్‌ ఆటకోసమే టెస్ట్‌ మ్యాచ్‌లు చూస్తా: మిల్స్‌

(photo:Rishabh Pant Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ కెరటం  రిషభ్ పంత్‌.. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా బాదడమే పనిగా పెట్టుకుంటాడు. క్రీజులో ఉన్నంతసేపూ సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. ఇలా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రిషభ్‌ ఆటతీరును చూసి ఫిదా అయిపోయిన ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ టైమల్‌ మిల్స్‌ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. తనకు టెస్టు క్రికెట్‌ని చూడటం ఇష్టం ఉండదని, పంత్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రమే చూస్తానని మిల్స్ పేర్కొన్నాడు.

‘గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్‌ క్రికెట్‌ను నేను ఆడటం లేదు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నా. నాకు సాధారణంగా టెస్ట్‌ మ్యాచ్‌లు చూడటం ఇష్టముండదు. కానీ, టెస్ట్‌ల్లో రిషభ్ పంత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు చూస్తా. అతడు ఆడుతుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టీవీకి అతుక్కుపోవాలనిపిస్తుంది. అతడు కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. నాకు వినోదాత్మక క్రికెట్ అంటే ఇష్టం’ అని టైమల్‌ మిల్స్‌ అన్నాడు. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు రిషభ్ పంత్ ఎంపికైన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని