పంత్‌ దెబ్బకు మళ్లీ ఆడతానో లేదో అనుకున్నా

తాజా వార్తలు

Published : 12/02/2021 01:15 IST

పంత్‌ దెబ్బకు మళ్లీ ఆడతానో లేదో అనుకున్నా

చెన్నై: తొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ విధ్వంసం చూశాక మళ్లీ క్రికెట్‌ ఆడతానో లేదో తెలియలేదని ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ అన్నాడు. అతడి విధ్వంసం నుంచి కోలుకొనేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాపై మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషంగా అనిపించిందని వెల్లడించాడు. కోహ్లీసేన ఈ టెస్టులో 227 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

‘భారత్‌లో ఇదే నా మొదటి పర్యటన. నా ఆరంభం మాత్రం కఠినంగా సాగింది! తొలి టెస్టు గెలవడంతో భావోద్వేగానికి గురయ్యా. అందుకే మనం క్రికెట్‌ను ఇంతగా ప్రేమిస్తాం అనిపిస్తుంది. మూడో రోజు 8 ఓవర్లలో 77 పరుగులు ఇచ్చాక మళ్లీ నేను క్రికెట్‌ ఆడతానో లేదో తెలియలేదు. అక్కడి నుంచి పుంజుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది’ అని లీచ్‌ అన్నాడు.

‘నాలుగో రోజు ఆఖర్లో రోహిత్‌ను ఔట్‌ చేసిన బంతిని భవిష్యత్తు మ్యాచుల కోసం మళ్లీ మళ్లీ ఊహించుకుంటాను. చక్కని టైమింగ్‌ ఉన్నప్పటికీ ఆ స్థాయి బ్యాటర్‌ను ఔట్‌ చేసినందుకు ఆనందం వేసింది. ఆ వికెట్‌ తీయడంతో ఆఖరి రోజు పది వికెట్లు తీయాల్సిన అవసరం లేదన్న అనుభూతి అందించింది’ అని లీచ్‌ తెలిపాడు.

ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్ తర్వాతి మూడు మ్యాచులకు అందుబాటులో ఉండకపోవడంపై లీచ్‌ స్పందించాడు. ‘చివరి మూడు టెస్టుల్లో అతడు బాగా ఆడాడు. అతడితో కలిసి నేను సోమర్‌సెట్‌ అండర్‌ 11కు ఆడాను. శ్రీలంకలో నేను ప్యాడిల్‌ స్వీప్‌కు ఔటైనప్పుడు ఆ షాట్‌ ఎలా ఆడాలో నేర్పించాడు. నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ప్రత్యర్థి జట్లను నేను చిరాకు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. సొంతగడ్డపై భారత్‌కు 34 మ్యాచుల్లో 28 విజయాలు, ఐదు డ్రా చేసిన అనుభవం ఉంది. అలాంటి జట్టుతో తర్వాతి మ్యాచుల్లో సవాళ్లు తప్పవు. వాళ్లు తిరిగి పుంజుకుంటారని తెలుసు. అందుకే మేం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడం ముఖ్యం’ అని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
కుల్‌దీప్‌ ఎంపికలో పక్షపాతమా?
ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని