ICC Rankings:జస్ప్రీత్‌ బుమ్రా ర్యాంక్‌ ఎంతంటే?
close

తాజా వార్తలు

Published : 27/05/2021 00:22 IST

ICC Rankings:జస్ప్రీత్‌ బుమ్రా ర్యాంక్‌ ఎంతంటే?

(photo:Jasprit Bumrah Twitter)

ఇంటర్నెట్ డెస్క్: బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో ఒక్క భారత బౌలర్‌కు మాత్రమే చోటు దక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్న టీమ్ఇండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ మెహిడీ హసన్ మిరాజ్‌ మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచి, కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాడు. ఈ ఘనత సాధించిన మూడో బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు బంగ్లా తరఫున ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్‌, లెగ్‌ స్పిన్నర్‌ అబ్దుర్ రజాక్‌ టాప్‌-2లో చోటు దక్కించుకున్నారు. మరో బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమన్‌ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.


ఇక, వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా..టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి రెండు, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానాలను నిలబెట్టుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని