ICC Rankings: అశ్విన్‌ ర్యాంక్ ఎంతంటే?
close

తాజా వార్తలు

Published : 13/05/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ICC Rankings: అశ్విన్‌ ర్యాంక్ ఎంతంటే?

ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌  రెండో స్థానం దక్కించుకున్నాడు. భారత తరపున అశ్విన్‌ ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్ ప్యాట్ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 739 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. 

జింబాబ్వేతో జరిగిన టెస్టులో మంచి ప్రదర్శన కనబరచిన పాక్‌ బౌలర్లు హసన్‌ అలీ నౌమాన్ అలీ, షాహీన్‌ ఆఫ్రిది కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకులను అందుకున్నారు. హసన్‌ అలీ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానం దక్కించుకోగా.. షాహీన్‌ తొమ్మిది స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో ఉన్నాడు. నౌమాన్ అలీ 54వ స్థానం నుంచి 46వ స్థానానికి చేరుకున్నాడు.

హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్‌బౌలర్లు హసన్‌ అలీ(5/27),  షాహీన్ ఆఫ్రిది (5/52), రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ నౌమాన్ అలీ(5/86) అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ 147 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇలా ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బౌలర్లు ఐదేసి వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1993లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు పౌల్ రిఫీల్, షేన్‌ వార్న్‌, టిమ్‌ మే ఈ ఘనత సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని